పీఓకే కూడా భారత్లో అంతర్భాగమే..

- దానికోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్దం - కశ్మీర్ అంశంతో ఇతర దేశాలకు సంబంధం లేదు - ఎలాంటి చట్టాలు చేయాలన్నా పార్లమెంట్ కు సర్వాధికారాలున్నాయి - చట్టం చేయకుండా అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు - జమ్ముకశ్మీర్ మళ్లీ రాష్ట్రం అవుతుంది - పార్లమెంట్లో హోంశాఖ మంత్రి అమిత్ షా - కశ్మీర్ పునర్విభజన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం - కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్రవాగ్వాదం - ఆర్టికల్ 370 రద్దుపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్న కాంగ్రెస్


 


న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ విభజనకు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు బిల్లును మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ అంశంపై కాం గ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ-కశ్మీర్ విషయంలో ఎలాంటి చట్టాలు చేయాలన్నా పార్లమెంటకు సర్వాధికారాలు న్నాయని పేర్కొనారు. చట్టం చేయకుండా అడ్డుకునే అధికారం | ఎవరికీ లేదని చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, ఆక్సాయ్ చిన్ సైతం భారత్కు చెందిన భూభాగాలేనని, రాజ్యాంగంలో ఈ . విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారని షా తెలిపారు. కశ్మీర్ అంశంతో ఇతర దేశాలకు సంబంధం లేదని అమిత్ షా ఉద్ఘాటించారు. పీఓకేను స్వాధీనం చేసుకోడానికి తన ప్రాణాలైనా అర్పించడానికి సిద్దంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అలాగే కశ్మీర్ అంశం తమ అంతర్గత వ్యవహారమని పాకిస్థాన్ తో జరిగిన పలు ద్వైపాక్షిక సమావేశాల్లో స్పష్టం చేశామని షా అన్నారు.. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరానికి ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకో వాలని కాంగ్రెస్ కోరుకుంటుందా? అని అమిత్ షా ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్ భారత్ లో అంతర్భాగం కాదని చెప్పదలచుకు న్నారా? అని కాంగ్రెస్ ను కేంద్ర మంత్రి నిలదీశారు. జమ్మూ కశ్మీర్ ను భారత్లో సంపూర్ణంగా విలీనం చేస్తున్నామని, ఈ పున ర్విభజన బిల్లు దేశ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయమని కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దుకు పార్లమెంటు ఆమోదం అవసరంలేదని, రాష్ట్రపతి గెజిట్ సరిపోతుందని షా స్పష్టీకరించారు. ఆర్టికల్ 370ను సోమవారమే రాష్ట్రపతి తన గెజిట్ ద్వారా రద్దుచేశారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కాం | గ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ అమిత్ షా ప్రసంగాన్ని అడ్డుకు న్నారు. కశ్మీర్ ద్వైపాకిక్ష అంశమా లేక దేశంలో అంతర్భాగమా అని ప్రశ్నించారు. కశ్మీర్ సమస్య ఇంటి సమస్య కాదు అని, అన్ని చట్టాలను ఉల్లంఘించి కశ్మీర్లు విభజిస్తున్నారని కాంగ్రెస్ నేత అధిర్ ఆరోపించారు. దానికి కేంద్ర మంత్రి షా క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలో అత్యంత ఆవేశానికి లోనైన కేంద్ర మంత్రి చాలా భావోద్వేగ ప్రసంగం చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు . చైనా ఆక్రమిత ప్రాంతం కూడా భారత్ భూభాగమే అని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు షా అన్నారు. కశ్మీర్ కోసం ప్రాణం ఇస్తానని, జమ్మూకశ్మీర్ అని తాను చెబుతున్నప్పుడు.. దాంట్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా ఉంటుందని షా చెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారం జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పీవోకే, ఆక్ సాయి చిన్ కూడా ఉన్నాయన్నారు. అన్ని చట్టాలను ఉల్లంఘించి కశ్మీర్ ను విభజిస్తున్నారని అధిర్ అన్నారు. మాజీ సీఎంలను గృహనిర్బంధం చేశారనన్నారు. భారీగా భద్రతా బలగాలను మోహరించి కశ్మీర్లు జైలుగా మార్చి, మాజీ ముఖ్యమంత్రులను గృహనిర్బంధలోకి తీసుకున్నారని దుయ్యబట్టింది. మొదటి నుంచి కశ్మీర్ అంతర్గత వ్యవహారంగానే ఉందని, ఇటీవల విదేశాంగ మంత్రి ఇది ద్వైపాక్షిక అంశమని చెప్పారని కాంగ్రెస్ మండిపడ్డింది. నిన్నటి వరకు ద్వైపాక్షిక అంశంగా ఉన్న కశ్మీర్, నేడు అంతర్గత వ్యవహారం ఎలా అవుతుందని కాంగ్రెస్ ప్రశ్నించింది. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని, కేంద్రం నిబంధనలను విస్మరించిందని ఆరోపించింది. ఈ బిల్లు గురించి తమకు ముందుస్తు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కాంగ్రెస్ సభ్యులు ధ్వజమెత్తింది. కశ్మీర్ పునర్విభజన బిల్లుపై సమగ్ర చర్చ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రధాన విపక్షం కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అయితే ఆ పార్టీకి చెందిన కొంత మంది నేతలు కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టడం విశేషం. కశ్మీర్ పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన వారు దేశ సమగ్రత, జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసం ఆర్టికల్ 370ని రద్దు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.


అసెంబ్లీ అనుమతి లేకుండా విభజన కుదరదు - మనీష్ తివారీ జమ్మూకశ్మీర్ పునర్ విభజన బిల్లు అప్రజాస్వామికమని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ఆరోపించారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని మూడవ సెక్షన్ ను ఉల్లంఘించారన్నారు. ఏపీ, తెలంగాణ విభజన రాజ్యాంగంలోని సెక్షన్ 3 ప్రకారం జరిగిందన్నారు. ఆ సెక్షన్ ప్రకారం రాష్ట్ర విభజన కోసం అసెంబ్లీ తీర్మానం అవసరం అని తెలిపారు. రాష్ట్ర సరిహద్దులు మార్చాలంటే ఈ నిబంధన అవసరం అన్నారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం ఉందని తివారీ చెప్పారు. దేశ విభజన సమయంలో జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్ అంశాలపై సమస్య వచ్చిందని, అయితే కశ్మీర్ ఎవరితో కలవాలన్న దానిపై మహారాజా హరి సింగ్ వద్ద ఉన్న రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నా యని, కానీ నెహ్రూ అక్కడికి దళాలను పంపి కశ్మీర్ ను భారత్లో కలిసేలా చేశారని తివారీ చెప్పారు. అయితే ఆ సమయంలో అమిత్ షా జోక్యం చేసుకున్నారు. ఇంతకీ 370 రద్దుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా లేదా అన్న అంశాన్ని తేల్చాలన్నారు. జమ్ముకశ్మీర్ మళ్లీ రాష్ట్రం అవుతుంది -అమిత్షా ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టడం తాత్కాలికమేనని, పరిస్థితులు అనుకూలిస్తే జమ్ముకశ్మీర్ మళ్లీ రాష్ట్రం అవుతుందని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్, లడఖ్లను ఎప్పటికీ కేంద్ర పాలిత ప్రాంతాలుగానే ఉంచాలని తాము అనుకోవడం లేదని పేర్కొన్న షా.. ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని స్పష్టం చేశారు. పరిస్థితులు మెరుగుపడితే ఏదో ఒక రోజు జమ్ముకశ్మీర్ మళ్లీ రాష్ట్రం అవుతుందని షా పునరుద్ఘాటించారు.