*ప్రజామోదమే ఆధునిక పోలీసింగ్ కు పునాది : ఎస్పీ రంగనాధ్*
- - ఆధునికరించిన నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఎస్పీ
- - ప్రజలకు మంరింత సమర్ధవంతంగా సేవలందించే దిశగా అధినిక పోలీస్
నల్గొండ : ప్రజలకు ఆమోదయోగ్యమైనప్పుడే ఆధునిక పోలీసింగ్ కు పునాది అని నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు.
సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఆధునీకరించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టే విధంగా సమర్ధవంతంగా పని చేస్తున్నామని చెప్పారు. సి.సి. కెమెరాల ద్వారా నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించే విధంగా అత్యధికంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చట్టం నుండి తప్పు చేసిన వ్యక్తులు ఎవరూ తప్పించుకోకుండా ఉండే విధంగా పటిష్ఠంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. ఆధునిక పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువ అయ్యే విధంగా పోలీస్ శాఖ పని చేస్తున్నదని చెప్పారు.
*జిల్లాలో 15 పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ*
జిల్లాలో మొత్తం 15 పోలీస్ స్టేషన్లను ఆధునికరిస్తున్నామని ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో అయిదు పోలీస్ స్టేషన్ల చొప్పున ఆధునీకరణ జరుగుతున్నదని తెలిపారు. ఒక్కో పోలీస్ స్టేషన్ కు 20 లక్షల చొప్పున 15 పోలీస్ స్టేషన్ లకు 3 కోట్ల రూపాయలు కేటాయించి పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ పనులు చేపటైనట్లు ఆయన చెప్పారు. కార్పొరేట్ స్థాయిలో పోలీస్ స్టేషన్ లను తీర్చిదిద్దడంతో పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు సత్వర న్యాయం అందించే విధంగా రిసెప్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఆధునికరిస్తున్న ప్రతి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది విధి నిర్వహణ కోసం రెండు లక్షల రూపాయల ఫర్నీచర్, డైనింగ్ ఏరియా, ఇతర సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో నల్గొండ డిఎస్పీ గంగారాం, సిఐలు బాషా, సురేష్, టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులు, సిబ్బంది పాల్గొన్నారు.