**ఈనెల 25వ తేదీన కార్టోశాట్-3**

ఈనెల 25వ తేదీన కార్టోశాట్-3 ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించ‌నున్న‌ట్లు ఇస్రో వెల్ల‌డించింది. కార్టోశాట్‌-3తో పాటు మ‌రో 13 క‌మ‌ర్షియ‌ల్ నానోశాటిలైట్ల‌ను క‌క్ష్య‌లోకి ప్రవేశ‌పెట్ట‌నున్నారు. హై రెజ‌ల్యూష‌న్ ఇమేజింగ్ సామ‌ర్థ్యం ఉన్న ఉప‌గ్ర‌హంగా కార్టోశాట్‌-3ని రూపొందించారు. ఇది థార్డ్ జ‌న‌రేష‌న్‌కు చెందిన‌ది. ఇస్రోకు చెందిన పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ రాకెట్ ద్వారా కార్టోశాట్‌-3ని నింగిలోకి ప్ర‌యోగిస్తారు. శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ సెంట‌ర్‌ నుంచి ఈ ప్ర‌యోగం జ‌ర‌గ‌నున్న‌ది. సుమారు 509 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న క‌క్ష్య‌లో కార్టోశాట్‌ను ఫిక్స్ చేయ‌నున్నారు. న‌వంబ‌ర్ 25వ తేదీన ఉద‌యం 9.28 నిమిషాల‌కు ఈ ప్ర‌యోగం జ‌ర‌గ‌నున్న‌ది. ఇటీవ‌ల న్యూస్పేస్ ఇండియాతో కుదిరిన ఒప్పందం నేప‌థ్యంలో.. అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్ల‌ను కూడా కార్టోశాట్‌తో నింగిలోకి పంప‌నున్నారు